ALL CATEGORIES

Alexander - The Great By Swarna

Rs. 90 Rs. 81

Availability :

Category: Great Personalities Telugu , Others Tag: Classic Books

ఇంతకముందు పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించే మహాసామ్రాజ్య స్థాపకులైన అలెగ్జాండర్, జూలియస్ సీజర్, చెంఘిజ్ ఖాన్, ఏకవ్యక్తి పాలకులైన నెపోలియన్, హిట్లర్ జీవిత చరిత్రలు; వారి బలాలు బలహీనతలు గురించి సంగ్రహంగా రాశాను. అయితే భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులలో అంతటి గొప్పవారు లేరా అంటే అశోకుడు ఒకడు కాగా మధ్య యుగాలలో ఆసియావాసి అక్బర్ గొప్ప పాలకుల్లో మరొకడు.ఇతడు చెంఘిజ్ ఖాన్ వారసుడైన బాబర్ మనుమడు. ఎందరో విదేశీయులు భారతదేశాన్ని దోచుకుని వెళ్ళిపోగా బాబర్ మాత్రం భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించగా అతడి మనుమడు, హుమాయూన్ కుమారుడైన అక్బర్ దక్షిణ భారతంలోని దక్కను ప్రాంతం వరకూ జయించి మొగల సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాడు. 

             ఇస్లాం మతంలో జన్మించిన ఈ చదువురాని పండితుడు అన్ని మత నాయకుల సమావేశాలు జరిపి తనూ ఆ చర్చల్లో పాల్గొని ప్రతి మతంలో మంచి - చెడు ఉన్నాయని; ఏది హేతుబద్ధమో అదే మంచి అని దీన్ - ఇల్లాహీ మతాన్ని ప్రతిపాదించాడు. కాని దాన్ని తన కొలువుకే పరిమితం చేశాడు. బలవంతపు మత మార్పిడులను నిరసించి మతసహనంతో కూడిన పాలన చేశాడు. తన కొలువులో ఎందరో హిందువులకు ప్రాధాన్యత నిచ్చి భారతదేశంలో నూతన సంస్కరణలకు పాలనా విధానానికి దోహదపడిన మధ్యయుగాల మహాచక్రవర్తి. అంతేకాక మొగల చక్రవర్తులలో అతి తక్కువ కాలం పాలించి భారతీయ ప్రజల మన్ననలు పొందినవాడు. అతడి జీవిత విశేషాలు, ఆసక్తికర ఘటనల సమాహారం ఈ రచన.

                                    - స్వర్ణ