ALL CATEGORIES

న్యాయబద్ధంగా అయిదు సంవత్సరాలలో యాభై లక్షలు సంపాదిస్తానని ఒకమ్మాయి తండ్రితో పందెం కట్టిన యువకుడి కథ ఇది.

న్యాయానికి, చట్టానికి ఉన్న తేడాను తెల్పుతూ, డబ్బు సంపాదించడంలో వివిధ రకాలయిన మెళకువలనీ అసాంతమూ తెలియజెప్పిన తొలి తెలుగు నవల.

ఎంతో మంది పాఠకులకు ప్రేరణ కలిగించి నిలదొక్కుకోవటానికి సహాయపడిన ఈ నవల మరెంతో ఇన్వెస్టిగేటివ్ రచయితలకు మార్గదర్శకమైంది అంటే అతిశయోక్తి లేదు. ఆర్ధికశాస్త్రాన్నీ, న్యాయశాస్త్రాన్నీ కలబోసి ప్రతీ పేజీలోనూ ఉత్కంఠ నిలిపిన ఈ రచన ప్రతీ పాఠకుడూ కొని చదివి తమ లైబ్రరీలో ఉంచుకోవాల్సిన పుస్తకం