ALL CATEGORIES

Dampatya Vanam - దాంపత్యవనం By Yaddanapudi Sulochana Rani (Novels)

Rs. 60 Rs. 54

Availability :

రవిచంద్ర బిజిలి భుజాలు చుట్టూ చేయి వేసాడు. దగరికి తీసుకంటూ అన్నాడు. " ఏడవకు భయపడకు" అతని కంఠం చురుగ్గా దగ్గత్తికగా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు. "బిజిలి నేను నీకు అన్యాయం జరుగానీయను. ఎనిమిది సంవస్తరాల క్రితం ధైర్యం లేక ఇలాటి పరిస్థిస్తుల్లో నా కెంతో ప్రియమైనాటు వంటి వ్యక్తిని పోగొట్టుకున్నాను. భగవాన్ ! నేను మళ్ళి ఆ తప్పు చేయను "  అస్పష్టం గా అన్నాడతను. బిజిలి కి అవేం వినిపించటం లేదు. అతని చేతుల ఆప్యాయత నిండిన స్పర్శ మాత్రమే తెలుస్తోంది. ఆ స్పర్శ లో నుంచి బిజిలీ శరీరంలో ఆనందం ఆవహిస్తున్నది. రవిచంద్ర బిజిలి ని  తీసుకుని కారు ఎక్కి ఇంటి ముఖం పట్టాడు . రవిచంద్ర బిజిలి ని తీసుకొని ఇంటికి వేళ్ళాడు . కారు డోర్ తెరచి, బిజిలి దిగుతుంటే, చేయి అందిస్తున్న రావిచంద్రని చూసి విన్నయ్య నొర్ తెరిచాడు. రవిచంద్ర బిజిలి ణి వెంటబెట్టుకుని ఇంటిలోకి వచ్చాడు. సరాసరి తన గదిలోకి తీస్కు వెళ్ళాడు. బిజిలి భయంగా బేలగా అతని వైపు చూస్తోంది. ఎందుకంత భయపడతావు ? ఇకనుంచి ఇది ఇల్లు ! నీ ఇంటిలో నీవు ఉన్నావని అనుకో అన్నాడు.... రావిచంద్రది బాగా కలిగిన కుటుంబం. రావిచంద్రకి లంబాడి తండాకి చెందిన ఆకతాయి అమ్మాయి బిజిలీతో పరిచయం ఏర్పడుతుంది. ఇదిప్రేమగా మారుతుంది. రవిచంద్ర పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా బిజిలిని ఇంటికి తెస్తాడు. రవిచంద్ర తండ్రి బిజిలి పై అత్యాచారం చేయబోతాడు. ఆ ఘర్షణ లో రవిచంద్ర మరణిస్తాడు. ఆ హత్యానేరం అన్యాయంగా బిజిలే పై పడుతంది.  బిజిలీ అలా జైలుపాలవుతుంది. ఇలా అనేక ఓ సాగే ఈ నవల దాంపత్య జీవితంలోని పవిత్రతని చిత్రిస్తుంది.