ALL CATEGORIES

Deeksha By Surya Prasada Rao (Kathala Samputi)

Rs. 100 Rs. 90

Availability :

Category: New Arrivals
సూర్యప్రసాదరావుగారి ఈ కథా సంపుటిలోని మొదటి కథ 'మాధవ సేవ' మొదలుకొని, ఆఖరి కథ 'ఈ రేయి తీయనిది' వరకూ అన్నీ ఏదో ఒక సద్భావాన్ని కలిగిస్తూ మంచి సందేశాలను సూచనప్రాయంగా చెప్పే కథలే! లోపభూయిష్టమైన పరిస్థితుల్నీ, మనుషుల ప్రవర్తనల్నీ సున్నితంగానూ, వ్యంగ్యంగానూ వ్యక్తం చేస్తూ అవసరమనుకున్నప్పుడు మాత్రం సంభాషణల్లోనూ అక్కడక్కడా ఆంగ్లపదాల్ని వాడినా... మొత్తం మీద చక్కని తెలుగు నుడికారాలతో సహజంగా రాయడం వల్ల, మన నిత్యానుభవాలను కథలుగా చదువుతున్న అనుభూతి కలుగుతుంది. చిన్న చిన్న సంఘటనల్ని పరిశీలించిన మనస్తత్వాన్ని తీసుకొని రాసిన ఆసక్తికరమైన కథానికలు ఇవి! దేవుడు, గుళ్ళు, పూజా పునస్కారాలూ తనకి ఇష్టం లేకపోయినా, భార్య అభిప్రాయాల్ని మన్నించి, ఆమెతో కలిసి గుడికి వెళ్ళినా... దైవభక్తి విషయంలో కొన్ని నమ్మకాల్ని మూఢ విశ్వాసాలుగా గుర్తించేటట్లు భార్యకి అతి సహజంగా బోధించిన తీరు 'మాధవ సేవ' కథలో కనిపిస్తుంది.