ALL CATEGORIES

ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్ళూ మూడురకాలుగా మోసం చేస్తే – వారి మీద పగబట్టిందో అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తించింది మరో అమ్మాయి. తనకన్నా పదిహేనేళ్ళు పెద్దయిన ‘ఆంటీ’ని మంచి చేసుకుంటే ‘జేబు ఖర్చు’కు లోటుండదని గ్రహించాడో పద్నాలుగేళ్ళ అబ్బాయి. సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగటానికి ప్రయత్నించాడు మరో అబ్బాయి. ఒక కాలనీలో పిల్లలు వీరంతా...? వీళ్ళ జీవిత గమ్యాలకు సాక్ష్యాలు ఆ కాలనీలో చెట్లు. ఆ చెట్లలాగే చాలామంది బ్రతికేస్తారు. కానీ... చెట్టుకీ, మనిషికీ ఒక ముఖ్యమైన తేడావుంది. అది – “ధ్యేయం” తెలుగు, కన్నడ భాషల్లో వన్ రైటర్, తమిళ, మళయాళం భాషల్లో పాపులర్ రైటర్ – యండమూరి వీరేంద్రనాథ్ నవల ధ్యేయం