ALL CATEGORIES

Jeevana Satyalu - జీవన సత్యాలు By Yaddanapudi Sulochana Rani (Novels)

Rs. 50 Rs. 45

Availability :

" పెళ్లి వాళ్ళ శరీరాలు దగ్గర కావచ్చునేమో గాని మనసులు దగ్గర కావు " "చాలా మంది ఆడవాళ్ళు ఇల్లు పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు. ఆడదానికి యివే ఎక్కువ సుస్థిరత అని నమ్ముతారు. స్రీ మూర్ఘురాలు అయితే ఇంటికి బానిస అవుతుంది. తెలివిగలది అయితే ఆ  ఇంటికి యజమానురాలు అవుతుంది. జీవితం అంటేనే కోర్కెల దాహం. ఆ దాహం ఎప్పుడూ ఏదో రకంగా తెరుతూ ఉండాలి. ఇవన్ని ఆంధ్రుల అభిమాన రచయిత్రి యద్దనపూడు సులోచనారాణి నవలల్లోని కొటేషన్లు . దాదాపు యాభై యేళ్ళగా సులోచనారాణి నవలా రచనలో ఉన్నారు. ఈ సుదీర్ఘ రచనా వ్యాసంగం లో ఆమె ఎన్నో విలక్షణమైన పాత్రలు సృష్టించారు. సెక్రటరీ రాజశేఖరం, జీవనతరంగాలులో రోజా, మీనాలో మీనా, పార్డులో పార్ధు , నీరాజనంలో మేనక, కీర్తి కీర్తి కీరీటాలలో స్వర్ణ, ఈ తరం కథలో రమేశే , ఆగమనంలో ప్రసన్న, అగ్నిపూలులో కృష్ణ చైతన్య .. ఈ ప్రాత్రాలన్నీ సజీవంగా కనిపిస్తాయి. ఆయా పాత్రలతో ఆయా సన్నివేశాలలో సులోచనారాణి అనేక జీవన సత్యాలను పలికించారు. నిజానికి వాటిల్లో అనేకం ఆమె అభిప్రాయాలే. అలాంటి కోటబుల్ కోట్స్ సంకలనమే జీవన సత్యాలు. ఒక రచయిత్రి నవలల్లోని కొటేషన్స్ తో ఇలా ఒక పుస్తకం వెలువడటం తెలుగులో బహుశా ఇదే ప్రధమం.