ALL CATEGORIES

 ఎత్తున నిలబడ్డవారికి క్రిందిచూపు ఉండదని పెద్దలంటారు. క్రింద నిలబడ్డవారికీ దృష్టి ఆకాశంలో వుంటుందని కూడా అంటుంటారు. ఇద్దరు స్నేహితురాళ్ళు -

            ఒకమ్మాయి ఉన్నతమయిన కుటుంబంలో పుట్టింది. కాని బ్రతుకు ఔన్నత్యమంతా అంతస్తుదే కాదని నమ్మింది.

            మరొకమ్మాయి మామూలు కుటుంబంలో పుట్టి పై అంతస్తులో పసందయిన జీవితం వుందని ఊహించింది. పేదరికపు వాతావరణం నుంచి పారిపోవటానికి ఆశతో అవకాశాలకు అర్రులు చాచింది. కాని జీవితం ఎదురు తిరిగి కాటేసింది.

           మరొక వ్యక్తికీ విలాసవస్తువు కాగలిగిందేకాని, భార్య కాలేక పోయింది. జీవితం తెగిన గాలిపటమయినా జీవితపు నగ్నత్వం కొట్టవచ్చినట్టు కనిపించింది. భవిష్యత్తు పెనుభూతమై వెక్కిరించి ఆఖరికి ఆత్మహత్య చేసుకొంది.

          స్నేహితురాలు సహాయపడాలని ఆత్రుత పడేసరికి వేళ మించి పోయింది.

          ఆ జ్ఞాపకానికి చిరస్మరణీయమైన రూపం కల్పించింది. ఆ అపురూప కల్పనే ఈ కల్యాణమందిర్.

- ఆరికెపూడి (కోడూరి) కౌసల్యదేవి