ALL CATEGORIES

హాస్పిటల్! స్పెషల్ వార్డులో వున్న గదితలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి.

అవంతి లోపలకు అడుగుపెట్టింది! గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో వున్నాడు. అతని రెండు చేతులు మణికట్టు దగ్గర కట్టుకట్టి వున్నాయి. వాటినిచూడగానే, అవంతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినయి! నిన్న “ఇదేమిటి?” అని తను అడిగినందుకు ‘జవాబు’గా అతను మణికట్ల దగ్గర నరాలు బ్లేడుతో కోసుకొని చచ్చిపోవటానికి సిద్ధం అయ్యాడు. డాక్టర్ల సామర్థ్యం వల్ల ప్రాణగండం గడిచింది. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తలదాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది. కట్టుకట్టిన చేత్తోనే ఆమెని గుండెలమీదకి లాక్కున్నాడు.

ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి మరో నవలా రాజం ‘కృష్ణలోహిత’ తప్పక చదవండి!