ALL CATEGORIES

వెరైటీ కోసం రకరకాల స్థలాల్లో రేప్ చేయటానికి ఉవ్విళ్ళూరే నరరూప రాక్షసుడు సలీంశంకర్, చీకటి ప్రపంచాన్ని తన చేతివేళ్ళతో శాసించగల మాఫియా లీడర్ వసంత్ దాదా – తమ ఉనికికి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మారణ హోమం సృష్టించే ఆ రక్తదాహపు జనారణ్యంలోకి...

పొరపాటున అడుగుపెట్టింది ఆ అమాయకప్పిల్ల. రక్తాన్ని చూస్తేనే మూర్ఛపోయే ఆ బేలకి, అనుకోకుండా భయంకరమైన ఒక రహస్యం తెలిసింది.

ఆ రహస్యం బయటకొస్తే వసంత్ దాదా సామ్రాజ్యం కుప్పకూలి పోతుంది. నేర ప్రపంచం నాశనమైపోతుంది. అలా కాకుండా చేయగల ఒకే ఒక వ్యక్తి రంగంలోకి దిగాడు.

మరణ మృదంగ ధ్వని ప్రళయకాల ప్రభంజనంలా ఆమెని వెంటాడింది.

* * *

మొదటి పేరా నుంచి చివరి వాక్యం వరకూ ఆపగల శైలితో, ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్‌తో, “నిజమే కదా” అనిపించే వాస్తవాలతో – పాఠకుల్ని మెస్మరైజ్ చేసే నవల... మరణ మృదంగం.