ALL CATEGORIES

ముందే చెపుతున్నాను స్మీ. ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించి నట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు. ఈ పుస్తకం 'స్నేహం- ఆప్యాయత - ప్రేమ - మోహం - దాంపత్యం - రొమాన్స్- అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.

ఇందులో:

స్నేహం:

స్నేహంలోంచి ప్రేమలోకి... స్నేహితుల్లో రకాలు... అకస్మాత్తుగా గుడ్ బై చెప్పే స్నేహితులు... ఖరీదైన స్నేహాలు... మంచి స్నేహితుడి పది లక్షణాలు... స్నేహం స్వార్థమా?... ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?

ప్రేమ:

తూపు తొలి చూపు... తొలి స్పర్శ... పప్పీ లవ్... పెళ్ళికి ముందు ప్రేమ... ప్రేమ వివాహాలు... పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు... ప్రేమలో ఎమోషన్స్... ప్రేమ - ఈర్ష్య.

దాంపత్యం:

ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే... లివ్ - ఇన్ - రిలేషన్... సెకండ్ సెటప్... సర్దుబాటు.

శృంగారం: వద్దనకు ఈ ముద్దు... రోమాన్స్... వాత్సాయన... విరహ వర్ణన... శృంగారానికి ఆరు మెట్లు.

అనుబంధం:

మూడు రకాల అనుబంధాలు.