అతనికి పేరు లేదు. తల్లి కడుపులోంచి... చెత్త కుండీ లోకి... అక్కణ్ణుంచి కాకులు దూరని కారడవిలోకి బానిసగా... తోడేళ్ళ లాటి మనుష్యుల మధ్యనుంచి బయటపడి... అంతకన్నా భయంకరమైన మాఫియా గ్రూపుల మధ్య చిక్కుకుని...
కేవలం ఒకే ఒక ఆశ. తన తల్లెవరో తెలుసు కోవాలని! ఆ ఆశని క్యాష్ చేసుకునే నక్కలు, రాబందులతో ఎడతెగని పోరాటంలో చివరికి...
తన తల్లెవరో తెలుసుకున్నాడా?
** ** **
1980 దశకంలో నవలగా సెన్సేషన్ సృష్టించి, తరువాత సినిమాగా సూపర్ హిట్ అయి, ఎన్నో ముద్రణల తరువాత ఇప్పుడు సరికొత్త గెటప్‌లో వచ్చింది. రాక్షసుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారని ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే దేశానికి ఎలాంటి “రాక్షసుడు” కావాలోచెప్పే నవల.