ALL CATEGORIES

Ramaneeya Bhagavata Kathalu - రమణీయ భాగవత కథలు By Mullapudi Venkata Ramana

Rs. 400 Rs. 360

Title : Ramaneeya Bhagavata Kathalu - రమణీయ భాగవత కథలు Author : Mullapudi Venkataramana - ముళ్ళపూడి వెంకట రమణ Publication : Rajachandra Foundation - రాజాచంద్ర ఫౌండేషన్

Availability :

శ్రీమద్రామాయణ భారత భాగవతాలు - మన జాతి సంపద. వేదం అనే మహాసముద్రం మనకోసం పంపించిన కెరటాలు. ఈత రాని వారికోసం - లోతు తెలుసు కోవాలన్న ఆసక్తివున్నా ఆ శక్తిలేని వారికోసం వచ్చిన ఈ కెరటాలు చేత వెన్నముద్దలు, చెంగల్వపూదండలు... వినోదంతో ఆకట్టుకుని - విజ్ఞానంతో బుద్ధిని నింపివేసి. మనసును మహదానంద సాగరంలో ఓలలాడించి జీవాత్మకు పరమాత్మను చేరేదారి చూపించే జానపదాలు- ఈ జ్ఞాన పథాలు. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో చెబుతుంది రామాయణం. కాని-నిజానికి మనం ఎలా నడుచుకుంటున్నామో వెల్లడించి చూపిస్తుంది భారతం. ఎలా నడుచుకున్నప్పటికీ తప్పు తెలుసుకుని భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే దుఃఖాన్ని తరించ వచ్చునని చెప్పేది భాగవతం. సుఖశాంతులనూ జనన మరణ చక్రం నుండి ముక్తినీ కూడా పొందడానికి ఇది దారి చూపిస్తుంది. దారివేస్తుంది. సహజంగా సులువుగా మనకే తెలియ కుండా మనలోకి ఊపిరిలా దూరిపోయే అహంకారం, చెమటలా చర్మాన్ని అంటిపెట్టుకుని మనదే అనిపించే మమకారం - ఇవి ఎంత గొప్ప వాడినైనా ఎలా పెడదారి పట్టించి నాశనం చేస్తాయో తెలియజెప్పే హెచ్చరించే భాగవతం - కేవలం నీతిని బోధించడమే కాక - భక్తి అనే అమృతంలో ఓలలాడించి అపారమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. శాంతినిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపించే భారతాన్ని కల్పించిన వ్యాస భగవానుడు ఆ తరువాత ఈ భాగవతాన్ని ఎందుకు చెప్పాడూ అన్నదే ఒక అద్భుతమైన, కనువిప్పు కలిగించే కమనీయమైన కథ