ALL CATEGORIES

తన చెల్లెలి జీవితంతో ఆడుకున్న సర్ జగపతిరావు బహదూర్ అనేవాడి మీద పగతీర్చుకునే నిమిత్తం ---

ప్రసాదరావు అనే కౌటుల్యుడు లాటి వృద్ధుడు జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడని వేణు అనే అందమైన కుర్రవాడిని నియమించాడు.

వాళ్ళ కాంట్రాక్టు ప్రకారం - జగపతిరావు కూతుర్ని ప్రేమలోకి దింపి, ఆమెకు గర్భం వచ్చాక వదిలి వెయ్యాలి. వేణు రంగంలోకి దిగాడు. దిగాక తెలిసింది -

చూస్తే నాలుగు పెదవుల కలయిక చాలా సులభం

ఆలోచిస్తే రెండు మనసుల కలయిక చాలా కష్టం

అని, అప్పటికే ప్రేమ వలలో పూర్తిగా ఇరుక్కుపోయిన వేణు ఎలా బయట పడ్డాడు?

మొదటి పేజీ నుంచీ చివరి పేజీ వరకూ సస్పెన్సుతో మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకుపోయే శైలిలో

అత్యద్భుతమైన శిల్పంతో, పరిపూర్ణమైన పాత్రల చిత్రణతో

యండమూరి వీరేంద్రనాథ్ మరో రచన సంపూర్ణ ప్రేమాయణం

తప్పక చదవండి!