ALL CATEGORIES

 ఈ "సర్వదేవతా యంత్రసిద్ధి" అను గ్రంధము మహోన్నత ఫలమునిచ్చునది. సర్వ దేవతా యంత్రములకు ఆలవాలమైనది. మానవులు వాంఛా సిద్ధి కొరకు ఏ యంత్రమును ఎన్నుకొని, జపము, హోమము, పూజాదులు సల్పి, దేవతా ప్రతిష్టల యందునూ, వ్యాపార స్థలము లందునూ, గ్రుహాదులను ప్రతిష్టించెదరో వారి వారి వాంఛాఫలము నలుబది రోజులలో సిద్ధింపగలరు. ఇయ్యది సాత్వన అనుభవ పూర్వక వాక్యము - నిస్సంశయము.

          ఈ "సర్వదేవతా యంత్రసిద్ధి' అను గ్రంధము స్వయం వ్యక్తమైనది. ఎన్నియో మంత్రం యంత్ర శాస్త్రాదులను దర్శించి, త్రిశతి పైగా దేవాలయ ప్రతిష్టలకు ఉపయోగించి, స్థిరవాంఛతో జనులకు కరదీపిక వలే ప్రకాశింపవలెనను సదుద్దేశాముతో స్వయంగా ప్రార్థనాది శ్లోకములనూ, ఛందో నియమాదులను, గాయత్రీ మూల మంత్రాదులను, హోమాది విధానములను, పూజా విధులను, బీజాక్షర స్వరూప స్వభావములను వ్రాశాను. పాఠకుని సౌలభ్యము కొరకు ముద్రలను, బీజాక్షర దేవతలను, ఫలములను కూడా అన్వేషించి, ఈ పుస్తకమునందు చేర్చితిని. దీనిని సవినయ పూర్వకంగా ఆచరించుకొని, యంత్రకోవిడులుగా ప్రకాశించాలని, సర్వజనులు వాంఛ తీరునట్లు సర్వఫలములు పొందాలని ఆకాంక్షించుచున్నాను.