ALL CATEGORIES

Siri Pakam - సిరి పాకం By Dr. Jagarlamudi Lakshmi (Chirudhanyalato 100 Vantakalu)

Rs. 100

Title : Siri Pakam (Chirudhanyalato 100 Vantakalu) - సిరి పాకం ( చిరు ధాన్యాలతొ 100 వంటకాలు) Author : Dr. Jagarlamudi Lakshmi -  డా. జాగర్లమూడి లక్ష్మి, Publication : Raitunestam Publications -  రైతునేస్తం Siri Dhanyalu, Dr. Khader Vali, Siri Dhanyalu, Health, Aarogya Amrutam, arogyam, Khadar Vali, Kadarvali, Kader Vali,

Availability :

           తరగని పోషకాల గనులు, ఆరోగ్య సిరులు అయిన సాంప్రదాయ చిరుధాన్య పంటలను ప్రజలు మరచిపోయారు. పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. చిరుధాన్యాలలో వరి, గోధుమల కంటే పోషక విలువధికం. నిజానికి చిరుధాన్యాలను ప్రస్తుతం "న్యూట్రి సీరియల్స్" గా అభివర్ణిస్తున్నారు. ప్రత్యేకంగా విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, భాస్వరం, ముఖ్య సూక్ష్మ పోషకాలు చిరుధాన్యాలలోనే అధికంగా ఉంటాయి. వరి లో కంటే చిరుధాన్యాలలో ప్రోటీన్లు, పీచు పదార్థం, ఖనిజాలు, కాల్షియo అధికంగా ఉంటాయి. అందువలన అవి పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి. ఇటీవలి కాలంలో ఆరోగ్య ప్రయోజనాల పై అవగాహన పెరిగి చిరుధాన్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. జొన్న, రాగి కొర్ర, సజ్జ, సామ, వరిగ, ఆరికలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలను ఆహారంగానే కాక చిరుతిండ్లుగా కూడా తీసుకోవచ్చు. వాతావరణ ప్రతికూల సమయాల్లో కూడా ఈ పంటలు పండించేందుకు అనుకూలం. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చాలామంది ఓట్స్ ను అల్పాహారంగా తీసుకుంటున్నారు. దీనికి బదులుగా జొన్న, రాగి, సజ్జలతో తయారైన అటుకులను ఓట్స్ కు బదులుగా అల్పాహారంగా తీసుకుంటే తక్కువ ఖర్చుతో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరం.
                                                                                                                      - డా. జాగర్లమూడి లక్ష్మి