ALL CATEGORIES

ఉపాసకులు గమనించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే? ఏ మంత్ర సాధన అయినా గ్రంథాలు చూసి చేస్తే ఫలించదు. మహామంత్రాలని సిద్ధిపొందిన గురువుల నుంచి ఉపదేశాన్ని పొంది, ఆ గురువు ఆదేశానుసారం వారి సూచనల ప్రకారం సాధన చేస్తేనే దేవతానుగ్రహం మంత్రసిద్ధి కలుగుతుంది. అలాకాక స్వతంత్రించి గ్రంధాల్లోని మంత్రాలను ఉపాసిస్తే అవి వికటించి మేలుజరగక పోగా కీడు జరిగే అవకాశమే ఎక్కువ. అయితే లోకంలో కొంతమంది పండితులు దేవత భక్తుణ్ణి ఆదరిస్తుంది కానీ ఎప్పుడూ శిక్షించదు కనుక భయపడాల్సిన పనిలేదని ఉద్భోదిస్తున్నారు. వీరి మాట శాంతదేవతల విషయంలో కొంత వరకూ నిజమైనప్పటికీ ఉగ్రదేవతా సాధనాల్లో అది దక్షిణాచారమైనా వామాచారమైనా సరియైన పద్ధతిలో గురువు ఉపదేశం లేకుండా మార్గదర్శనం లేకుండా మంత్రసాధన చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా వరకూ ఉంది. కనుక సాధకులు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఈ గ్రంథంలో పేర్కొన్న దేవమంత్రం 1 లక్ష జపానికి పురశ్చరణ ఏ విధంగా చేయాలో సవివరంగా తెలియజేశాము. ఇదే పద్ధతిలో ఇందులో ఇచ్చిన ఇతర మంత్రాలను కూడా ఆ మంత్రానికి చెప్పిన జపసంఖ్యను అనుసరించి సాధకులు తమ పురశ్చరణని కొనసాగించాలి.

                                                                                       డా. జయంతి చక్రవర్