ALL CATEGORIES

Viraaji - విరాజి By Kommuri Venugopala Rao (Novels)

Rs. 70 Rs. 63

Availability :

గౌతమ్ రచయిత. అతని రచనలను అభిమానించే విరాజి పరిచయమై ఎంతో సన్నిహితమవుతుంది. అతని రచనలకు ఆమె ఊపిరి.అతను మంచి రచయిత కాగలడని ఆమె విశ్వాసం. ఆమె వ్యక్తిత్వం,సంస్కారం అతన్నిఎంతగానోఆకర్షిస్తాయి. విరాజి ప్రోత్సాహంతో పదిరోజుల్లో నవలరాసి పోటికి పంపిస్తాడు గౌతమ్. ఆ నవలకు మొదటి బహుమతి వస్తుంది. బహుమతిగా వచ్చిన డబ్బుతో డ్యాన్స్ బ్యాలే తయారు చేస్తున్నారు గౌతమ్,విరాజి.

బ్యాలే కొద్దిరోజులుందనగా విరాజికి అపెండిసైటీస్ వస్తుంది. ఆపరేషన్ కు డబ్బులేదు. ఇక తప్పని సరై,డబ్బుకోసం ‘నాదముని’ మధ్యలో వదిలేసిన సీరియల్స్ పూర్తిచేస్తున్నాడు గౌతమ్.

ఈ విషయం తెలిసిన విరాజి షాక్ తింటుంది. గౌతమ్ ఉన్నతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అతను చెప్పిన కారణాన్ని కూడా వప్పుకోదు. గౌతమ్ అంటే విరాజికి ఏహ్యభావం కలుగుతుంది.

విరాజి లేకుండా తను తనుగా ఉండలేకపోతున్నాననే సంఘర్షణ ప్రారంభమౌతుంది గౌతమ్ లో.

ఈ సంఘర్షణ పర్యవసానం ఏమిటో…

విరాజి చదివితే తెలుస్తుంది.