Categories

Aavarana Telugu Book By S.L.Bhyrappa

Availability: In stock
SKU: ESC0001

Rs.200 Rs.180

Compare

Description

ఇది నా రెండో చారిత్రక నవల. ఎనిమిదవ శతాబ్దపు సంధికాలం అంతశ్శక్తిని ‘సార్థ’ నవలా రూపంలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. ‘ఆవరణ’లో ‘సార్థ’ తర్వాతి కాలం నాటి సత్యాన్ని చిత్రించడానికి పూనుకొన్నాను. భారతదేశ చరిత్రలో ఎంతో క్లిష్టమైన ఈ కాలం గురించి తెలుసుకొనేందుకు విపులసామగ్రి లభిస్తుంది. కాని ఆవరణశక్తి (సత్యాన్ని కప్పిపుచ్చే శక్తి) ఈ సమృద్ధ సామగ్రి కంటె ఎన్నో రెట్లు గొప్పది. ‘సార్థ’ నవల కాలంనాటి చరిత్ర ఆవరణశక్తికి ఎక్కువగా బలి కాకపోవడం గమనార్హం.

ఆ కాలపు చరిత్ర గురించి నిర్భయంగా సత్యాన్ని ప్రకటించవచ్చు. కాని ‘ఆవరణ’ నవల కాలం నాటి చరిత్ర గురించి అలా చెప్పలేం. అడుగడుగునా ఆవరణశక్తిని చీల్చుకొంటూ ముందుకు సాగవలసిన అనివార్య పరిస్థితులు ఎదురవుతాయి. అందువల్ల ఈ నవల స్వరూపం – శిల్పాన్ని దానికి అనుగుణంగా నిర్మించుకోవాల్సి వచ్చింది…