ALL CATEGORIES

Bandhi బందీ By Yaddanapudi Sulochana Rani (Novels)

Rs. 60

Availability :

కవితా ! పెళ్ళంటే నాకు భయం లేదు. కానీ ఈ లోకం చేసే అవహేళనల్ని సహించే శక్తి నాకు లేదేమోనని భయం వేస్తోంది. చిన్నప్పటి నుంచి అవసరం వున్నా లేకపోయినా చుక్కమ్మత్తలాంటి వాళ్ళు పదేపదే గుడ్డివాడు అంటూ నా అవిటి తనం వేలెత్తి చూపుతూ వ్యంగ్యంగా మాటలు అనేవాళ్ళు. నేను సాటి పిల్లలతో కాస్త సరదాగా ఉంటె "కళ్ళు కనిపిస్తే ఇంకా అసలు కాళ్ళు భూమి మీద నిలిచేవి కావేమో " అనేవాళ్ళు . హరికి అంధత్వం ఒక శాపంగా పరిణమి స్తుంది. . సూటి పోటి మాటలు వినీ వినీ అతడిలో నైరాశ్యమూ ఆత్మన్యానత భావమూ చోటుచేసుకున్నాయి. సుందరితో పరిచయం మరో చెడు అనుభవం. వదిన పోవటం, అన్నయ్యకు మతిస్థిమితం తప్పటం అతడికి మరింత కుంగదీశాయి . గుడ్డితనం చేతిలో బందీ అయిన తనకు పెళ్లి అనవసరమనుకున్నాడు. పెళ్లి గనక చేసుకుంటే తనకి పుట్టే బిడ్డలకి కూడా తన దురదృష్టం వస్తూందే మోనని భయపడ్డాడు. అయితే హరిని కవిత ప్రేమిస్తుంది. తల్లిలా ఆదరిస్తుంది. నీడలా తోడుంటుంది . మనిషికి మన శ్సాంతి లోనే సుఖం ఉంటుందని నమ్మిన కవిత హరిని పెళ్ళికి ఒప్పిస్తుంది. ఆపరేషన్ సైతం చేయిస్తుంది. హరికి చూపు వస్తుంది. ? అతడు కవితను పెళ్లి చేసుకుంటాడా ? వాళ్ళ జీవితాలు ఇంకా ఎన్ని మలుపులు తిరిగాయి ? అందత్వంతో అత్మన్యానత భావంతో బాధపడే ఓ యువకుడి చుట్టూ అగ్రేశేణి రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అల్లిన ఆర్ధమైన కథ -