ALL CATEGORIES

Bhagavadgeeta Yadhatadhamu - భగవద్గీత యథాతథము By A.C.Bhakthi Vedanta Swamy

Rs. 300

Title : Bhagavad Geeta Yadhatadhamu - భగవద్గీత యథాతథము Author : A C Bhathi Vedanta Swami - ఎ.సి.భక్తి వేదాంత స్వామి Publication : Bhaktivedanta Book Trust - భక్తి వేదాంత బుక్‌ ట్రస్ట్‌, Tags : ISKCON, స్కాన్‌, Temples, Bhagavatgeeta,

Availability :

దేవనాగరి మరియు తెలుగు లిపి యందు మూల సంస్కృతశ్లోకములు, ప్రతిపదార్థములు, తాత్పర్యములు, భాష్యములను కూడియున్న సమగ్ర సంపుటము ''భగవద్గీత యథాతథము'. ప్రపంచమందలి నలుబదికి పైగా భాషలలోనికి అనువదింపబడి లక్షలాది ప్రతులు జనులకు అందింపబడినవి. భారతదేశమునే గాక పాశ్చాత్య ప్రపంచమునను విస్తృతముగా అధ్యయనము చేయబడు భగవద్గీత సంపుటమిది. శ్రీమద్భగవద్గీత వేదవిజ్ఞానసారము. తన ఆప్తమిత్రుడును, భక్తుడును అగు అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఈ గీతోపదేశము సప్తశతశ్లోక సమన్వితమై జీవుని యథార్థస్థితిని మరియు భగవానునితో జీవునికి గల సంబంధమును తెలియజేయుచున్నది. ప్రపంచములో అగ్రగణ్యులైన వేదవిజ్ఞానబోధకులును, ఆచార్యులును, శ్రీకృష్ణుని నుండియే ఆరంభమైన అవిచ్ఛిన్న గురుపరంపరకు ప్రతినిధులను అగు శ్రీశ్రీల ఏ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులవారు ఈ గీతావ్యాఖ్యానము నందు శ్రీకృష్ణభగవానుని సందేశమును యథాతథముగా ప్రసాదించిరి. గీత యొక్క ఇతర వ్యాఖ్యానములు ఆయా వ్యాఖ్యాతల మన:ప్రవృత్తులను ప్రతిబింబింపజేయుచు వాస్తవసందేశమును మరుఉగుపరచుచుండ శ్రీల ప్రభు పాదులవారి ఈ వ్యాఖ్యానము దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశముల వైపుకే పాఠకుని దృష్టిని కేంద్రీకరింపజేయుచు గీతాజ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహనను ఒసగుచున్నది. పేజీలు : 960