ALL CATEGORIES

Jayakantan Kathalu - జయకాంతన్‌ కథలు By Jayakanthan (Translated By Jillella Balaji)

Rs. 150 Rs. 135

Title : Jayakantan Kathalu - జయకాంతన్‌ కథలు Author : Jayakantan - జయకాంతన్‌  (Anuvadam - Translation : Jillella Balaji - జిల్లేళ్ళ బాలాజీ) Publication : Hyderabad Book Trust - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు

Availability :

Category: New Arrivals , Others Tag: HBT|Hyderabad Book Trust
మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్‌ కథలో కొన్ని ఇదిగో మీ కోసం... - కామం పిడికిట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను తీసి ఆమెకు కట్టబెట్టేస్తాడు - 'ఉడుపు' కథలో. - ఇంట్లో ఉక్కపోత, ఒంట్లో ఉక్కపోత, వీధిలోకి చూసే కిటికీనే తన ఒంటరితనానికి పరిష్కారం ఆ తల్లిలేని అమ్మాయికి. కెలైడ్‌స్కోప్‌ లాగా వీధిలో పరుగులు తీసే దృశ్యాలు ఆమె జీవితపు కలలు. దృశ్యాలలో కాలమూ దొర్లిపోతుంది. చదివే పాఠకుని హృదయంలో శోకపూరితమైన వీచిక చుట్టేస్తుంది. - 'నేను కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాను'... అన్న కథలో. - తాను నమ్మిన వ్యక్తి చేసిన మోసానికి గురయ్యానని బాధపడి, మనసుకు సర్దిచెప్పుకుంటే - ఆశ్చర్యకరంగా తనను మోసం చేసిన వ్యక్తి చేసిన పని వల్ల మనిషి మీద అపారమైన నమ్మకాన్ని కలిగించే కథ - 'నమ్మకం'. ఇలా... స్త్రీ పురుష సంబంధాల గాఢతను తెలిపే మరెన్నో కథలను ఇందులో... చదవండి!