ALL CATEGORIES

నిఖిల్‌ ఒళ్లు జలదరించింది. కళ్లు చిట్లించి అటువైపు చూశాడు. యు.ఎఫ్‌.ఓ.! ఫ్లయింగ్‌ సాసర్‌ !! ఎగిరే పళ్లెం!!! అంతవరకూ కేవలం పుస్తకాల్లో మాత్రమే చదివాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు... ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో అతడు పక్కకి తిరిగి చూశాడు. ఇద్దరు పైలెట్లూ లేరు. లోపలికి వెళ్లినట్టున్నారు. అతడు చెవులకున్న ఫోన్లు తీయాలన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆ వస్తువు తమకెంత దూరంలో వుందో లెక్కగట్టడానికి ప్రయత్నించాడు... ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వున్న యే గెలాక్సీలోని గ్రహవాసులో తమ ఇంధనం కొరతను తీర్చుకోవడానికి సూర్యుడి లాంటి నక్షత్రాల కోసం వెదుకుతుండగా వారి దృష్టి మన సూర్యుడి మీద పడితే ?! వారు తమ అద్భుత సాంకేతిక శక్తితో సూర్యుడిని తమ గ్రహానికి చేరువగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తే .... ? ఆ పరిస్థితిని నివారించడం కోసం భూలోకంలోని శాస్త్రజ్ఞులు ఆ సుదూర గ్రహానికి రాయబారం నిమిత్తం ఓ బృందాన్ని పంపితే ?! అప్పుడేం జరుగుతుంది ? భూలోకవాసుల రాయబారం ఫలిస్తుందా ? సూర్యుడి చుట్టూతా కమ్ముకున్న చీట్లు తొలగిపోతాయా ? అద్భుతమైన కథాకథనంతో  తనదైన శైలిలో ఆగ్రశ్రేణి రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ అందిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ - చీకట్లో సూర్యుడు