ALL CATEGORIES

Dasopanishattulu - దశోపనిషత్తులు By Tallapragada Ravi Kumar

Rs. 200 Rs. 180

Availability :

చతుర్వేద సారమైన ఉపనిషత్తులు యోగసాధకులకు కామధేనువు వంటివి. నాలుగు వేదాలలోనూ ప్రతిపాదింపబడిన ధర్మసూక్ష్మాలు, యోగరహస్యాలు, ఉపాసనా పద్ధతులూ ఉపనిషత్తుల్లో ఉదాహరణలతో, పిట్టకథలతో, ఆసక్తి గొలిపే వర్ణనా వైచిత్రితో వివరింపబడినాయి.

భగవాన్ వేదవ్యాసుల ద్వారా నరజాతికి అందించబడిన ఈ ఉపనిషత్తులు శంకరభగవత్పాదుల కృపాకటాక్షం వల్ల పండితులు, విద్వాంసులకు బోధపడింది. ఆ తర్వాత ఎందరెందరో ఉపనిషత్తులకు తమదైన భాష్యాలను రచించి పండిత పామరులకు ఉపనిషత్తుల పరిచయ భాగ్యం కలిగించారు.

క్లిష్టమైన వేదాంత రహస్యాలనూ, యోగసాధనా పద్ధతులనూ తేలికపాటి సులభంగా అర్ధమయ్యే ఉదాహరణలతో అందించడం ఉపనిషత్తుల ప్రత్యేకత. సాధకుని యోగ్యతను బట్టి అందవలసినంత విజ్ఞానం అందడం సాధ్యపడుతుంది.