ALL CATEGORIES

Ee Taram Katha - ఈ తరం కథ By Yaddanapudi Sulochana Rani (Novels)

Rs. 120 Rs. 108

Availability :

Category: Novels and Detectives , Others Tag: Quality Publishers

మమతల వెల్లువలో మనసుల్ని చల్లబరిచే యద్దనపూడి సులోచనారాణి నవల. ''పెళ్ళంటే తలంబ్రాలు, సన్నాయి వాయిద్యం, కట్నాలు, కానుకల పేచీలు...యీ తతంగానికి తరతరాలుగా అలవాటుపడిపోయాం మనం వేరు హేమా! మనది కొత్తతరం ...'' ''ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. అన్నింటికీ కారణం డబ్బు హేమా...డబ్బు''...ఇది ....కులం, మతం లేనివాడుగా లోకంచేత వెలికివేయబడ్డ రమేష్‌కి సంఘం మీద అభిప్రాయం. అయిన వాళ్ళందర్నీ కాదని రమేష్‌తో జీవితాన్ని పంచుకుని అతని నిరుద్యోగాన్ని, యింట్లో యిబ్బందిని, అనేక రకాల కలతలను ఆనందంగా స్వీకరించిన హేమకి కొన్నాళ్ళకి ఏర్పడ్డ అభిప్రాయం...''దేవతల్ని రాక్షసులుగా రాక్షసుల్ని దైవాలుగా మార్చేయగల శక్తి ఒక్క డబ్బుకే వుందేమో..'' ఆర్ధిక స్థితిగతులు కలిగించే అల్లకల్లోలానికి, ఈ తరం మనసుల వేగానికి ప్రతిభావంతంగా శ్రీమతి సులోచనారాణి చేసిన సజీవ రూపకల్న. మన చుట్టూ వున్న జీవితాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోటానికి ఈ తరంవాళ్ళు తప్పక చదవాల్సిన నవల!