ALL CATEGORIES

Goutamiputra Saatakarni By Emani Sivananagi Reddy

Rs. 99 Rs. 90

Availability :

శాతవాహన చరిత్రను ఎంతమంది రాసినా, గౌతమీపుత్రుని ఘనతను గురించి ఒక్క బి ఎస్ ఎల్ హనుమంతరావుగారు లాంటి ఒకరిద్దరు పరిశోధకులు తప్ప, మిగతావారు అంతగా పట్టించుకోలేదు. గౌతమీపుత్రుని కుటుంబం, పరిపాలన, సామ్రాజ్యం, శకరాజైన నహాపాణునితో యుద్ధం, గుణగణాల గురించి, సాధించిన విజయాలు, పొందిన బిరుదుల గురించి వసిష్టీపుత్ర పులుమావి, గౌతమి బలసిరి వేయించిన నాసిక్ 3వ నంబర్ గుహలోని ప్రశస్తి శాసనం ఈ విషయాలకు అద్దం పడుతుంది.

             ఈ నేపథ్యంలో, ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న శాతవాహనుల చారిత్రిక ఆధారాల్ని, వచ్చిన పుస్తకాలనే కాక, శాసనాలు, నాణేలు, కట్టడాలు, శిల్పాలను పరిశోధించి గౌతమీపుత్ర శాతకర్ణిపై విపులంగా ఒక పుస్తకాన్ని రాసి, తెలుగు వారికి అందించినందుకు చరిత్రకారుడు, పురావస్తు పరిశోధకుడు, స్థపతి అన్నపూర్ణాపుత్ర ఈమని శివనాగిరెడ్డి అభినందనీయుడు. ఈ గ్రంథాన్ని తెలుగు వారంతా ఆదరిస్తారని ఆశిస్తూ, శివనాగిరెడ్డి మరిన్ని చారిత్రిక గ్రంథాలు రాయాలని కోరుకుంటున్నాను.