ALL CATEGORIES

Idiot By Puranam Subrahmanya Sarma , Gollapudi Maruthi Rao & Kommuri Venugopal Rao

Rs. 125 Rs. 113

Availability :

Category: Stories

ఎండ మెట్లమీద నుండి వెనక్కు జారుకుంటోంది. తీగలమీద ఆరేసిన బట్టలు క్రిందపడ్డ ఎవరూ చూడలేదు. యధేచ్చగా గుమ్మాలన్నీ దాటుకుంటూ తెల్లమచ్చల నల్లపిల్లి ఇల్లంతా అలంగం తిరిగింది. ఉదయం తాగి కదగకుండా విడిచిన కాఫీ గ్లాసుల్ని బోర్లదోసింది. ఎంగిలి కంచాలలో మూతి పెట్టి, షెల్ఫ్ మీదకు దూకి చల్లగా కిటికీలోంచి పక్క వాటాలోకి జారుకుంది. గోడ గడియారం చప్పుడు చేస్తోంది. పందిరిమంచం నడువేక్కి కూర్చుని మాసిన తలగడా ఒళ్లో పెట్టుకొని ఉప్పులో ఊరేసిన నిమ్మకాయ పెచ్చు చీకుతూ శ్యామల ఏకదీక్షగా పాకెట్ నవల చదువుకుంటోంది. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మీరు ఈ పుస్తకం చదవక తప్పదు.