ALL CATEGORIES

నేను ఇప్పుడు ఆ హోటలుకి మజమానురాలిని నా సొంత చెల్లలు అందరు ఉద్యోగస్తుల తో కలసి పని చేయడం నాకు ఇష్టం లేదు. అంది సౌదర్య. సౌదర్యా ! కాని అది నాకూ అమ్మకీ అన్నం పెట్టె ఉద్యోగం. నేనేం తప్పు చేసాను. అంది సంయుక్త . నువ్వే తప్పేం చేయలేదు. నాకు ఇష్టం లేదు నిన్ను అక్కడ చూస్తుంటే నేను వున్న ఆ మురికి కూపం గుర్తుకు వస్తుంది. అంది. నాకు మళ్ళి ఉద్యోగం దొరకడం కష్టం అంది సంయుక్త . అది నీ తలనొప్పి అంటూ సౌదర్య భుజాలు ఎగేసింది. అమ్మని చూడడానికి రావా ? రాను . వచ్చి ఆవిడ తిట్టే తిట్లు వినలేను అమ్మ ఏడుస్తోంది అది ఆవిడ ఖర్మ... ఇది ముగ్గురు అక్క చెల్లెళ్ళ కథ సౌదర్య , సంగీత సంయుక్త మొగ్గురూ ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన స్వభావాలు మాత్రం వేరు. బాగా కలిగిన కుటుంబ మైనా భార్య భానుమతి కారణంగా భరద్వాజ అప్పుల పాలవుతాడు. ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ ఆసరా లేని ఆ కుటుంబం నానా కష్టాలు పడుతుంది. సౌదర్య డబ్బుకాశపడి తండ్రి వయసున్న సహదేవవర్మని పెళ్లి చేసుకుంటుంది. సంగీతాది మరో ప్రపంచం. సంగీతం తప్ప ఇంకేమీ తెలియదు. ఇక సంయుక్తే ఆ ఇంటికి ఆధారమవుతుంది. రాత్రింబవళ్ళూ శ్రమించి తనదైన జీవితాన్ని నిర్మించు కుంటుంది. . కలిమిలేములనూ బిన్న మనస్తత్వలనూ చిత్రిస్తూ జీవితాన్ని సురభిళం చేసేదేమిటో తెలియజెప్పే యద్దనపూడి సులోచనారాణి నవల.