ALL CATEGORIES

 'కలియుగంలో దత్తావతారములు' అనే ఈ చిన్ని గ్రంథంలో మూల పురుషుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర సంక్షిప్తముగా తెలుపబడినది. అటుపిమ్మట అనగా కలియుగంలో 4420 సంవత్సరములు గడిచిన పిమ్మట (క్రీ.శ.1320 సంవత్సరం) నుండి 19వ శతాబ్దం చివరి వరకు దక్షిణ భారతదేశంలో జన్మించిన దత్తాంశావతారములుగా పేర్కొనబడిన 1)శ్రీపాదశ్రీవల్లభ స్వామి 2)శ్రీనరసింహ సరస్వతి స్వామి 3)మాణిక్య ప్రభువు 4)స్వామి సమర్థ (అక్కల్ కోట మహరాజ్) 5) శ్రీ షిరిడీ సాయిబాబా వార్ల యొక్క జీవిత విశేషాలను, వారి మహిమలను, వారొనర్చిన దివ్య బోధలను ఈ గ్రంథము నందు సంగ్రహముగా పొందుపరచి ఈ దత్తావతార పంచకమును గురించి పాఠకులకు ప్రాథమికావ గాహన గావి౦చటమైనది మరియు ఆ కాలంలోనే అన్య ప్రాంతాలలో తమ మహిమలను వెలయించిన శ్రీ గజానన మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా వార్ల జీవిత విశేషాలు, మహిమలు ప్రస్థావించబడినదవి. శ్రీ దత్తాత్రేయ స్వామి భగవైద్వ భావాన్ని విస్తృతంగా ప్రచారం గావించి దత్త సాక్షాత్కారాన్ని పొందిన సిద్ద పురుషుడు శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి యొక్క జీవిత విశేషాలు కూడా తెలుపబడినవి. అక్కడక్కడా సందర్భానుసారంగా ఆత్మతత్వమును గురించి నవ విధ భక్తి మార్గములను గురించి అందరికీ సులభ గ్రహ్యమగు రీతిలో తెలుపుట జరిగినది.

                                                            - శ్రీ గురుదత్త సేవాసమితి, తెనాలి