ALL CATEGORIES

ఈ పోతరాజుగారంటే కవులలో అందరికీ అపారమైన గౌరవం. ఆ గౌరవం అంతా యింతా అని చెప్పడానికి అలవికాదు. భాగవత ప్రతిపాద్యుడైన శ్రీకృష్ణభగవానుణ్ణి ప్రేమించేవారికంటే కూడా పోతరాజు గారిని ప్రేమించే వారే లోకంలో విస్తారంగా ఉంటారు. * * * ఇప్పుడు ప్రతి జాతీ స్వాతంత్ర్యాన్ని కోరే రోజులు. కవులు మాత్రం పరతంత్రులుగా బిరుదుల కొఱకెందుకు వొకళ్లని ఆశ్రయించాలీ. ఆశ్రయిస్తే యిస్తారే అందాం. పిదప "పంచశుభమ్". * * * "అహం న పండితః ఇయ్యది నా ప్రస్తుతస్థితి. ఈ వయస్సులో నెవరికేని యిదియే శరణ్యమను కొందును. దీనికి వెనుకటివి కూడా రెండవస్థలు కలవు. అవి "అహమేవ పండితః, అహంచ పండితః" అనునవి. అవి మాత్ర మీ వయస్సునకు దగినవి కావనుకొనియెదను.