ALL CATEGORIES

Maidanam - మైదానం By Chalam (Novels)

Rs. 250 Rs. 225

Availability :

ప్రేమ వున్నప్పుడు త్యాగం చెయ్యడం ఎంత సులభమనుకున్నావు ? ఊరికే ఏ త్యాగానికైనా పతివ్రతల్ని పొగుడుతారుగాని, ప్రతినిమిషం సౌఖ్యాల్ని, ఆనందాల్ని అవసరంగానైనా సరే వోదిలేసుకుని ప్రేమబలం స్థిరపరచాలని వుంటుంది.

              అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్ధమయింది నాకు, ఆ స్థలంలో అద్వితీయనందాన్ని అనుభవించబోతున్నానని. చుట్టూ ఉన్న ఆకాశాన్ని, కొండల్ని, పక్కన చింత చెట్లనీ మా చిన్న ఇల్లునీ, ఆ గాలినీ, అమీర్నీ చూడగానే నా మనసెట్లా అయిందనుకున్నావు చెప్పనా?

                  చిన్నప్ప్పుడు మన ముందు పది పిండి వంటలు పెడితే, ఏది తినాలో తోచక, తినబోతున్నామని తెలిసి కూడా అన్నీ ఒక్కమాటుగా యెట్లా తినాలా, ఇది తినే లోపల రెండోది రుచి చూడడం అలస్యమౌతుందే అని ఎంత కష్టపడుతుంది మనసు? అట్లానే ముందే తెలుసు. దినం తరువాత దినం నాకు తీసుకురాగల వివిధ వర్ణరాగ సుందరానుభావాలు! కాని ఆగలేను. అన్నీ ఒక్కసారిగా, తొరగా ఎప్పుడు నన్ను కావలించుకుంటయా అని తహతహలాడిపోయినాను. ఏం కారణం లేకుండా చిన్నప్పుడు నవ్వు, అర్ధంలేని ఆనందం కలిగి ఇంకా ఏం చేద్దాం.  తిరుగుదాం. గంతులేద్దాం. నవ్వుకుందాం అనిపించేదే! అట్లా ఉండేది గంట గంటా నాకు, వురికీ, మాకు మధ్య పెద్ద చింతతోట వుంది. ఆ గుడిసె తప్ప ఇంక చుట్టూ ఏమీలేవు. ఎటు చూసినా నీలపు కొండల్లోనూ, ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. ఒక్క పెద్ద కొండ మాత్రం మా యింటికి అరమైలు దూరంలో వుంది. దానిమీద శిధిలమైన కోట ఒకటుంది. మా గుడిశ పక్కన చిన్నయేరు ఎప్పుడూ తొరగ పరిగెత్తుతూ వుంటుంది.

                  ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్లే వుంటుంది. వాన కురిసినా శుభ్రమైన కొండల్ని, నేలనీ ఇంకా శుభ్రంగా కడుగుతుంది. టపటపమని  చినుకులు పడితే, కడుపుతో ఉన్న స్త్రీవలె నాయేరు నిండిపోయేది. కొండలన్నీ మేఘాల్ని కప్పుకొని తెల్లవయేవి.

 ఈ పుస్తకంలో ఇంకా అరుణా, బ్రాహ్మణీకం, జీవితాదర్శం నవలలు కూడా ఉన్నాయి.