ALL CATEGORIES

పుస్తకం పేరు, రచయిత పేరు చూడగానే అందులోని కథాకమామిషు ఇట్టే గ్రహించవచ్చు. ఇన్నయ్యగారి విషయంలో ఇది మరీ తేలిక.  ప్రముఖ హేతువాది, రేషనలిస్టు ఇన్నయ్యగారు  75 సంవత్సరాల తన సుదీర్ఘ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఘటనలని మనముందుంచారు. ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకథ  అని గానీ, జ్ఞాపకాలు అని గానీ, ఓ జర్నలిస్టు డైరీ అని గానీ భావించవచ్చు. ఇవి మానవతావాదిగా ఆయన అనుభవాలే – తన జీవితంలో ఎదురుపడ్డ చేదు, తీపి అనుభవాలసారమే ఈ పుస్తకం! మానవవాదులంతా చదవదగిన ఒక మానవవాది ఆత్మకథ ఇది. నిజానికి నిర్భయతను  జోడించి, జ్ఞానాన్ని అనుభవాల గీటురాయిమీద సానబెట్టి జీవన గమనంలో ఎదురైన మహోన్నత వ్యక్తులవల్ల ప్రభావితులైన నరిసెట్టి ఇన్నయ్యగారు హేతువాద ఆలోచనా ధోరణిలో కొనసాగుతూ …. వెలువరించిన అక్షర సంపద ఈ  పుస్తకం.