ALL CATEGORIES

Manogatam మనోగతం By Suryadevara Ram Mohana Rao (Novels)

Rs. 180 Rs. 162

Availability :

చంద్రం కారు అక్కడికి చేరుకునేసరికే పరిస్థితి చాలా బీభత్సంగా వుంది. ఆరు టాంకర్‌లలో ఏ ఒక్కటీ ప్రత్యర్థులు వదిలిపెట్టలేదు. రోడ్‌ నుంచి ఎడంపక్కగా వందగజాల దూరంలోని బంజరు భూమిలోకి టాంకర్‌లను మళ్ళించి అక్కడ నిప్పు పెట్టారు. దారుణమైన అగ్నిజ్వాలల్లో తగలబడిపోతున్నాయవి. మూడు టాంకులు పేలిపోయి, నిప్పుగుండంలా వుందా ప్రాంతమంతా. హైవేలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు జనాన్ని ఆ పరిసరాల్లోకి రాకుండా దూరంగా తరుముతున్నారు.

చంద్రం వెళ్ళి పోలీసుల్ని కలుసుకుని మాట్లాడాడు.

మేనేజరును పక్కకు తీసుకొచ్చాడు.

''వాళ్ళు వెళ్ళిపోయి ఎంతసేపయింది?'' అడిగాడు.

''ఇరవై నిముషాల క్రితమే వెళ్ళిపోయారు సార్‌.''

''ఎంతమంది?''

''సుమారు ముప్ఫై మంది వుండొచ్చండి.''

''నువ్వు స్పష్టంగా చూసావా? వాళ్ళతో సూర్యం వున్నాడా?''

''ఉన్నాడండి. మాట్లాడాడు కూడా. వెళ్ళరా, వెళ్ళి నీ బాస్‌ ఆ చంద్రంగాడితో చెప్పు. ఇదేకాదు - ఇంకా భారీగా నష్టం కలిగిస్తాను. వాడ్ని సర్వనాశనం చేస్తాను. దమ్ముంటే ఆపుకోమను. మగాడయితే నాకు ఫోన్‌ చేసి మాట్లాడమను. అంటూ ఫోన్‌ నంబరు యిచ్చి వెళ్ళాడండి'' అంటూ ఫోన్‌ నంబర్‌ స్లిప్‌ని జాగ్రత్తగా చంద్రం చేతిలో పెట్టాడు మేనేజరు.

నంబరు చూసాడు చంద్రం.

అప్పటికే అక్కడికొచ్చిన ప్రియ, పల్లవి ఇద్దరూ కూడ ఆ నంబరు చూసారు. ఇప్పుడు జరిగిన నష్టం తక్కువేమీకాదు. సుమారు అరవైలక్షలు. అంతేకాదు, తిరిగి లోడ్‌ తెప్పించుకునేవరకూ ఫాక్టరీలో ప్రొడక్షన్‌ సగం తరిగిపోయి అది వేరే నష్టం.

సూర్యంమీద ఉబికివస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకొంటూ పోలీసులవైపు అడుగులేసాడు చంద్రం.

పల్లవి, ప్రియలు తగలబడుతున్న టాంకర్లను చూస్తూ షాక్‌తో అలాగే నిలబడిపోయారు.