ALL CATEGORIES

'శత్రు గూఢచారులు నా ప్రాణం తీస్తున్నా, నా వారిని హింసిస్తున్నా - నా దేశ రహస్యాలు చెప్పను....'' సి.బి.ఐ ఆఫీసు గోడ మీద చిన్న కొటేషన్‌ అది. దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె! పర్యవసానం - భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది !! తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విషసర్పాలతో అని ఆమెకు తెలీదు!!! తన చర్య కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాల్ని కాపాడబోతోందా ? చాలా కాలం విరామం తర్వాత యండమూరి వీరేంద్రనాథ్‌ కలం నుంచి జాలువారిన ఒక వినూత్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఒక వర్షాకాలపు సాయంత్రం'. చరిత్రలో ప్రాముఖ్యం వున్న కొన్ని పాత్రలను తీసుకొని దానికి కాల్పనిక పాత్రలని జతపరచి కథ నడపటం అనేది కొందరు ప్రముఖ పాశ్చాత్య రచయితల టెక్నిక్‌. ఈ నవలలో అదే టెక్నిక్‌ని ఎంచుకొని కథ నడిపారు యండమూరి వీరేంద్రనాథ్‌. మంచితనం భారతదేశానికి కష్టాల్నే మిగిల్చింది కాబట్టి, ఇకనైనా ఆ పంథా మార్చుకోవాలంటారు రచయిత. 'విజయవిహారం' పత్రికలో సీరియల్‌గా వచ్చిన నవలయిది.