ALL CATEGORIES

ఆ కుటుంబంలోనివారు బయటి ప్రపంచంలోకి పోకుండా తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుంటే, తరాలు గడచినకొద్దీ మందబుద్ధులు, అనేక జబ్బులతో కూడుకున్న వాళ్ళూ పుడుతూ ఉంటారు. బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధులూ, అంగవైకల్యమున్న పిల్లలూ, తీవ్రమైన చర్మ వ్యాధులూ, ఒకరకమైన పక్షవాతం...వీటన్నింటిపైన మేనరికాల ప్రభావం చాలా ఉంటుంది. అందుకే మేనరికాలు వద్దు. బావలూ, మరదళ్ళే కాక ఈ విశాల ప్రపంచంలో ఇంకా ఎందరో అద్భుత వ్యక్తులు ఉన్నారు. మేనరికాలు చేసుకోవటం వలన జరిగే అనర్ధాలూ, అవకతవక పుట్టుకల గురించి ఎంతో విపులంగా డాక్టరైన కొమ్మూరి వేణుగోపాలరావుగారు ఈ నవల ద్వారా వివరించారు. తప్పక చదవండి.