ALL CATEGORIES

టేబుల్ మీద కాగితం ఒకటి ఎగిరి వచ్చి రత్న కాళ్ళ దగ్గర పడింది. రత్న వంగి దాని తీసుకుని చూసింది. దానిమీద శివా దస్తూరితో యిలా వున్నాయి. వాక్యాలు. తలెత్తి చూస్తె వినీలాకాశంలో ఎన్నెన్నో నక్షత్రాలు ! ఒక్కక్క ఒంటరి నక్షత్రపు చరిత్ర ఒక్కొక్క మహద్బుతం ! అలాగే కలాగగనంలో విభిన్న తారకలు ! తరచి చూస్తె ఒకొక్క కళాకారుని కదా ఒకొక్క మహా కావ్యం. డబ్బు , పేరు, గ్లామర్ అన్నే వున్నా జీవితంలో సుఖ శాంతులు ఎరగని ఒక శివా కథ ఇది. ప్రేమ కోసం అతన చేయి జాస్తే కపటం,మోసం ఎదురయింది. నమ్మిన వారే అతనిని నాశనం చేయడానికి సిద్దం అయితే, యిక ఆ ప్రాణి పడే బాధ, ఆవేదన, జీవన మురళి లో అనుభవాల గాయాల గురించి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు  చెప్పిన నవల రెండోవ భాగమిది. పాఠకులు రెండూ కలిపి తీసుకోవాలని మనవి.