ALL CATEGORIES

ఆ ఇద్దరు అతివలలోఒకరు ‘చాకు’ అయితే ఒకరు ‘తమలపాకు’. ఒకరు చల్లని పాదరసపు దీపకాంతిలాంటి వారైతే… ఒకరు కణ కణ మండే నిప్పుకణం. సమాజ జీవితంలో సంప్రదాయాన్ని ఛేదించుకుంటూ, పంజరాలను పగలగొట్టుకుంటూ ముందుకు దూసుకుపోగలిగితే తప్ప నేటి స్త్రీకి మనుగడ లేదన్నది ఒకరి వాదం. స్త్రీ మనుగడకు సంప్రదాయం,సహనం,శీలం వినా వేరుశరణ్యం లేదని ఒకరి అచంచల విశ్వాసం. కొత్తలోని ఎరుపుదనం, పాతలోని పసుపుదనం, కొత్తలోని కరుకుదనంపు కారం, పాతలోని మెతకతనపు నిస్సారం, పోనీ సారం… వీటిని చర్చించటానికి రచయిత పడ్డ తాపత్రయమే
 

‘పసుపు-కుంకుమ’