ALL CATEGORIES

కొన్ని పేర్లు వినగానే గౌరవం కలుగుతుంది. ఇష్టం పెరుగుతుంది. చూడాలనిపిస్తుంది. `పేరు’కి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల పేరు కోసం ఎన్నో రోజులు, మాసాలు కూడా ఆలోచిస్తారు. కాంబినేషన్లు వెతుకుతారు. సంతృప్తికరమైన పేరు దొరక్క కొన్నేళ్ళపాటూ పేరు పెట్టని సందర్భాలు కూడా ఉన్నాయి. వారి కోసమే ఈ పుస్తకం.

“అనూజ్ఞ, మధువని, స్వప్నమిత్ర, వేదసంహిత, హిమసమీర, ప్రశాంతనివాళి, హేమంత సంధ్య” లాంటి పేర్లు పెట్టటంలో యండమూరి వీరేంద్రనాథ్‌ది విశిష్ట స్థానం. ఈనాడు తరచుగా వినిపిస్తూన్న “అనూష, ప్రవల్లిక, విహారి, హారిక” లాంటి పేర్లు ఒకప్పుడు యండమూరి పాపులర్ చేసినవే.

కేవలం రచనల్లోనే కాదు. శ్రీజ (జగదేకవీరుడు – అతిలోక సుందరి), హారిక (ఛాలెంజ్), అనూష (మరణ మృదంగం), రేవంత్ (వెన్నెల్లో ఆడపిల్ల), ప్రవల్లిక, నికుంజ్ విహారి (అఖరి పోరాటం), హంసలేఖ (రుద్రనేత్ర), విద్యాధరి (ముత్యమంత ముద్దు) లాంటి పేర్లు తెలుగు సినిమా తెరకి వన్నె తెచ్చాయి.

తల్లిదండ్రుల సౌలభ్యం కోసం ఎన్నోగ్రంథాలు, పుస్తకాలు శోధించి క్రోడీకరించి ఆయన తయారుచేసిన ఈ పుస్తకంలో వివిధములైన రాగాలు, నదులు, శుభ్రపదమైన దేవతల పేర్లు కూడా మిళితం చేయబడ్డాయి.