ALL CATEGORIES

Sabda Ratnakaramu Telugu Telugu Nighantuvu - శబ్దరత్నాకరము తెలుగు తెలుగు నిఘంటువు By Bahujanapalli Sitaramacharyulu

Rs. 450 Rs. 405

Title : Sabda Ratnakaramu (Telugu Telugu Nighantuvu) - శబ్దరత్నాకరము, తెలుగు తెలుగు నిఘంటువు Author : Bahujanapalli Seetaramacharyulu - బహుజనపల్లి సీతారామాచార్యులు Tags : Dictionary, Nighantuvu, నిఘంటువు, Padakosam, Spelling, Meaning, డిక్షనరీ, పదకోశం, గ్రామర్, Glossary, Language, Vocabulary, Encyclopedia, Reference, Terminology, Lexicon, Concordance, Palaver, గ్లోసరి, లాంగ్వేజ్, భాష, వొకాబులరి, ఎన్ సైక్లొపీడియా, రిఫరెన్సె, టెర్మినాలజి, లెక్సికాన్, Synonyms, Antonyms,

Availability :

   తెలుగు వాజ్మయంలో కోశ సాహిత్యానికి సింహభాగం వాటా ఉంది. అది వంశపారంపర్యంగా వచ్చిందే. భాషాద్యయనానికి కోశాద్యయనం తప్పనిసరి. కోశం చదివిన వాడే - అంటే కంటస్తం చేసినవాడే పండితుడని ఒకనాటి భావన. అంతేకాదు జ్ఞానం సంపాదించేందుకు నిఘంటువునైనా సంపాదించు లేదా దేశాన్నయిన చూడు అనేది ఒక సదుక్తి. ఈ మంచిమాట ఈనాటికి శిరోధార్యమైనదే. పిన్నలకూ, పెద్దలకూ - ఎల్లరకు అన్వయించేదే.

        ఈ తరుణంలో నేటి, రేపటి అవసరాలకు తగినట్లు మన పెద్దలు, మన మేధావుల జ్ఞానసంపదకు ప్రతిరూపాలైన నిఘంటువులను అనువైన రీతిలో మలచుకోవలసిన కాలం ఆసన్నమైంది.ఈ దిశలో తెలుగునాట విశేష ప్రసిద్ది గాంచిన బహుజనపల్లి సీతారామాచార్యులు గారి  'శబ్ద రత్నాకరము' (1885) నిఘంటువును తిరిగి ప్రచురించుకోవలసిన అవసరం వచ్చింది. ఈ బాటలో ఒక ప్రయత్నం ఈ గ్రంధం. ఈ గ్రంధ ప్రచురణలో పదాల సంఖ్యను ఏ మాత్రం తగ్గించలేదు. ఈనాటి పత్రికలలో ఎన్నో నూతన పదాలు ఏరోజుకారోజు సృష్టి అవుతున్నాయి. కొన్ని పదాలు ఆంగ్ల బాషా సంజనితాలు. వీటిలో కొన్ని అనుబంధంలో చేర్చబడ్డాయి. వీటితోపాటు తెలుగు నిఘంటువులో సమ్మిళితాలైన నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి-వికృతులు చేర్చడం జరిగింది. ఇందు తెలంగాణా, రాయలసీమ ప్రాంత జాతీయాలను చేర్చడం ఒక ప్రేత్యేకత.

       ఇలా పలు నూతన ప్రయోగాలతో, విశేషాలతో, వైజ్ఞానిక సౌరభాలతో ఈ నిఘంటువు నిర్మాణం జరిగింది. దీన్ని విద్యార్ధి లోకం హర్షిస్తుందని ఆశిస్తున్నాను.

                                                                                                                 - వెలగా వెంకటప్పయ్య