ALL CATEGORIES

  ఈ లోకంలో కన్ను విప్పింది మొదలు గారాల పట్టిగా పెరిగి, లోకజ్ఞానం తెలిసీ తెలియని అపరిపక్వ మనస్కయైన ఒక కన్య తొలి ప్రేమానుభవాల దాగుడుమూతల ప్రణయగాధ.

          సాధారణ కుటుంబాలలోని పిన్నలకూ, పెద్దలకూ, అందరకూ అన్నిటా ఎదురయ్యే సంయుక్త సమస్యాతోరణం.

      తన ఓర్పూ విజ్ఞానలతో మనుష్యులలో మార్పును, మంచినీ తేగలిగిన ఆదర్శ మహిళా, జ్ఞానమూర్తి కధానాయకిగా...

         తన విద్యుక్త ధర్మాల నెరిగి ప్రవర్తించి, సదా సుధావర్షాలు కురిపించుతూ పాషాణ హృదయములలో కూడా పరివర్తన తీసుకు రాగలిగిన అమృతమూర్తి కధానాయకుడుగా...

        నెమ్మదిగా, నిదానంగా సాగిన ప్రశాంతి నిర్ఘరిణి, ఇదీ శాంతినికేతన్. తప్పక చదువుతారని కోరుకుంటున్నాం.

- ఆరికెపూడి (కోడూరి) కౌసల్యదేవి