ALL CATEGORIES

Soviet Russialo Em Jarigindi - సోవియట్‌ రష్యాలో ఏం జరిగింది? By Ranganayakamma

Rs. 100

Title : Soviet Russia Lo Em Jarigindi - సోవియట్‌ రష్యాలో ఏం జరిగింది? Author : Ranganayakamma - రంగనాయకమ్మ Publication : Sweet Home Publications - స్వీట్‌ హోమ్‌ పబ్లికేషన్స్‌ Tags :  Class Struggles In The USSR, Charles Bettelheim, ఛార్లెస్‌ బెత్లహామ్‌, క్లాస్‌ స్ట్రగుల్స్‌ ఇన్‌ ది యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌., U.S.S.R., 1917 అక్టోబర్ విప్లవం ఎందుకు పోయింది? 1917 Viplavam Enduku Poyindi?,

Availability :

Category: Philosophy Marxism , Others Tag: Sweet Home Publications

చార్లెస్ బెత్లెహాం రాసిన క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ ది యు.యస్.యస్.ఆర్. అనే నాలుగు సంపుటాల సంక్షిప్త పరిచయం - సోవియట్ రష్యాలో ఏం జరిగింది?

రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి వుంది. ఆ విప్లవాన్ని, ''రష్యన్‌ అక్టోబర్‌ విప్లవం'' అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952లో, ''సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ''గా అయింది. కానీ, ఆ కమ్యూనిస్టు పార్టీ, 1991 ఆగస్టు 29న రద్దయి పోయింది! రద్దు తర్వాత, ఆ పార్టీని నిషేధించడం కూడా జరిగింది!

ఛార్లెస్‌ బెతల్‌హామ్‌, రష్యా - చైనాల గురించి రాసిన అనేక సంపుటాలు, రష్యా చైనాల విప్లవాల గురించి కొంత సమాచారం అయినా ఇవ్వగలవని గతంలోనే తెలుసు.

ఇప్పుడు, కమ్యూనిస్టు పత్రికల్లో, సోవియట్‌ అక్టోబరు విప్లవం గురించి, ''శత జయంతి'' కీర్తనలే గానీ ఆ విప్లవం నామ రూపాలు లేకుండా ఎందుకు పోయిందో, ఏ సమాచారమూ చెప్పకపోవడం చూశాక, బెతల్‌హామ్‌ సంపుటాల వేపే నా దృష్టి తిరిగింది.

బెతల్‌హామ్‌ రచనలకు ఎందుకు విలువ ఇవ్వాలంటే, ఈ వ్యక్తి, ''మార్క్సిజం'' నించి ఏ మాత్రమూ పక్క అడుగులు వెయ్యని వ్యక్తి! వ్యక్తుల్నీ, ఉద్యమాల్నీ, విప్లవాల్నీ, శ్రామిక వర్గ పోరాటాల దృష్టితో పరివీలించిన వ్యక్తి! ఈయన చెప్పిన సమాచారం చూసినప్పుడు, రష్యా విప్లవం గురించీ, ఆ పార్టీ గురించీ, కొంతైనా తెలిసే అవకాశం వుంది.

Class Struggles In The USSR By Charles Bettelheim in Four Volumes  : First Period : 1917 - 1923 Second Period : 1923 - 1930 Third Period : (Part 1 : The Dominated) : 1930 - 1941 Third Period : (Part 2 : The Dominators) : 1930 - 1941 పేజీలు : 456