ALL CATEGORIES

మత్స్య మహాపురాణం విస్తృత పురాణాలలో ఒకటి. ఇందులో 290 అధ్యాయాలున్నాయి. మొత్తం 15 వేల శ్లోకాలు ఉన్నాయి. మత్య్స రూపంలోని శ్రీ మహా విష్ణువు కల్పాదియందు శ్రుతి అర్థమును నరసింహ వర్ణన సందర్భంలో ఏడు కల్పాల విషయ వివరణ చేసినట్టినదే మత్స్యపురాణామని స్వయంగా ఇందులో చెప్పబడి ఉన్నది. ప్రారంభంలో మన్వంతరాల గురించి సంక్షిప్తమైన వివరణ చేసిన తర్వాత పితృదేవగణాల వర్ణన విస్తృతంగా ఉన్నది. అనేక రకాల వ్రతాలను గురించిన సుందరమైన వర్ణన ఇందులో కనిపిస్తుంది.

తీర్థాలలో శ్రేష్టమైన ప్రయాగ క్షేత్ర భౌగోళిక వివరణ, మాహాత్యము చాలా విపులంగా ఉన్నది. రాజవంశ వర్ణనలలో సోమవంశ వర్ణన చాలా విపులంగా ఉన్నది. పరమేశ్వరుని త్రిపురాసుర యుద్ధము సంహారం సవిరంగా విపులంగా చెప్పబడింది. తారకాసుర వధ కూడా ఇందులో విస్తృతంగా చెప్పబడింది. మత్స్యావతార కథ ప్రధానంగా ఉండడం చేత దీని మత్స్య పురాణం అనే పేరు సార్థకం అవుతున్నది.

కాశీ ప్రయాగ క్షేత్రాలు, నర్మదా నదీ ప్రాంతంలో ఉన్న క్షేత్రాలను గురించిన విపుల వర్ణన ఉన్నది. ఋషి వంశాల వర్ణనం, 25 అధ్యాయాలలో రాజధర్మ ప్రతిపాదనము, వివిధ దేవతామూర్తుల ప్రతిమ నిర్మాణాదుల విస్తృత వర్ణనం ఈ పురాణంలో ప్రధానంగా ప్రతిపాదించబడిన విశేషం