ALL CATEGORIES

Teravenuka Dasari - తెరవెనుక దాసరి By Pasupuleti Ramarao

Rs. 300 Rs. 270

Title : Teravenuka Dasari - తెరవెనుక దాసరి Author : Pasupuleti Ramarao - పసుపులేటి రామారావు Publication : Pasupuleti Prachuranalu - పసుపులేటి ప్రచురణలు Tags : Dasari Narayana Rao, Dasari, Director, Nirmata,

Availability :

దాసరిగారి ప్రతీ నిర్ణయం విప్లవాత్మకం..

వారి జీవితంలో ప్రతీ అంకం చారిత్రాత్మకం

పాఠకులందరికీ నా హృదయ పూర్వకమైన నమస్కారాలు. మనసులోని అభిప్రాయాలు పంచుకునే అవకాశమిచ్చినందుకు ఈ పుస్తక రచయిత శ్రీ పసుపులేటి రామారావుగారికి ముందుగా నా ధన్యవాదాలు. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే చాలా కష్టం. కానీ దా.స.రి. అన్న మూడక్షరాలు చాలు, వారేంటో తెలియలంటే. దా.. అంటే దాతృత్వం, స.. అంటే సమర్థత, రి.. అంటే రివల్యూషనరీ.

దాతృత్వం :

దాసరి నారాయణరావుగారు, ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని సంచలనాలు సృష్టించినా, ఎని& ఉన్నత పదవులు చేపట్టినా ఈరోజున వారికి ప్రజల హృదయాల్లో సింహాసనమేసింది మాత్రం వారి 'దాతృత్వమే'. నేను పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచీ గమనిస్తున్నాను. వాళ్ళింట్లో ప్రతీపూటా యాభైకి తక్కువ కాకుండా విస్తర్లు పరుస్తూనే ఉన్నారు. కలవడానికి వచ్చిన వారెవరూ ఖాళీ కడుపుతో తిరిగెళ్లడం వారికి ఇష్టం ఉండేది కాదు. అన్నదానంలోనే కాదు, అన్ని దానాల్లోనూ ఆయనకాయనే సాటి. పరిశ్రమలో ఏ కార్మికుడికేకష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆ కష్టం తీరేవరకూ బాసటగా నిలిచారు. అర్థరాత్రి వెళ్లి తలుపు తట్టినా చిరునవ్వుతో ఎదురొచ్చిమరీ సాయపడ్డారు. అది వారి దాతృత్వం - అది వారి వ్యక్తిత్వం.

సమర్థత :

పెద్ద హీరోల సినిమాలైనా, కొత్త హీరోల సినిమాలైనా దాసరిగారి సినిమాల్లో దాసరిగారి మార్కే ఖచ్చితంగా కనబడుతుంది. కథ, స్త్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నటన ఇలా ఏ శాఖమీదైనా పట్టు సాధించిన సమర్థుడు.

రివల్యూషనరీ :

మనందరికీ తెలుసు.. రివల్యూషన్‌ అంటే మార్పు. దాసరిగారి ముందు వరకూ మన తెలుగు చిత్రసీమలో చాలా మంది దర్శకులు, కథారచయితల చేత కథలు రాయించి, మాటల రచయితలతో సంభాషణలు రాయించి, ప్రతీ టెక్నీషియన్‌ దగ్గరనుంచీ పని రాబట్టుకుంటూనే, తమ దర్శకత్వ ప్రతిభను జోడించి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తూ ఉండేవారు.

దర్శకరత్న దాసరి జీవిత విశేషాలెన్నో తెలిపే ఈ పుస్తకం ఓ పుస్తకంగానే కాకుండా, ముందుతరాల వారికి మార్గదర్శనం చేసే ఉత్కృష్ట గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తుందని రచయితని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని ఆశిస్తున్నాను. - డా|| కె.చిరంజీవి

పేజీలు : 248