ALL CATEGORIES

Valliddaru Antena - వాళ్ళిద్దరూ అంతేనా? By Ranganayakamma

Rs. 150 Rs. 135

Title : Vaalliddaru Antenaa - వాళ్ళిద్దరూ అంతేనా? Autor : Ranganayakamma - రంగనాయకమ్ Publication : Sweet Home Publications - స్వీట్‌ హోమ్‌ పబ్లికేషన్స్‌

Availability :

Category: General , Others Tag: Sweet Home Publications
సమాజంలో వున్న ఏదైనా ఒక వాస్తవాన్ని యధాతధంగా చూపిస్తే, అది ఒక 'వార్త'! లేదా, ఆ వాస్తవానికి కల్పనల్ని కూడా జోడించి, దాని ఒక 'కథ'గా మార్చితే, అది ఒక 'రచన'! ఏ రచన అయినా, వాస్తవాలకు కల్పనలు చేర్చడం ద్వారానే తయారవుతుంది. 'కల్పన' అనేది, వాస్తవాల మీదే ఆధారపడి, వాస్తవాల్ని సమర్థిస్తూ గానీ, తిరస్కరిస్తూ గానీ, సాగుతుంది. ఒక భక్తుడు, రోజంతా పూజలు చేస్తూ, దేవుళ్ళ గురించి కలలు కంటూ గడుపుతున్నాడంటే, అది వాస్తవమే. ఆ పూజలు, జరుగుతూ వుండేవే. కానీ, ఆ భక్తుడి ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడనీ, భక్తుడు కోరిన వరాలు దేవుడు ఇచ్చాడనీ, కథ రాసేస్తే, అది పండు 'అబద్ధమే'! ఈ కల్పన, వాస్తవం మీద ఆధారపడేది అవదు. ''దేవుడు వరాలు ఇస్తే బాగుండును. అలా జరిగితే బాగుండును'' అనే కోరిక అది. ఎన్నడూ ఎక్కడా జరగని కోరిక అది. కానీ, సాంఘిక సమస్యల మీద కల్పనలు అయితే, అటువంటి అబద్దాలుగా ఉండవు. అవి జరగవచ్చు. లేదా ''మన సమస్యల్ని అలా పరిష్కరించుకోవాలి. అది గ్రహించండి!'' అని చెప్పే బోధనలుగా అయినా అవి వుండవచ్చు. 'అవమానాలు' ఎవరికి జరుగుతూ వుంటాయో వాళ్ళు, ఆ అవమానాల నించి బైటపడాలి! ఒక వ్యక్తికైనా, ఒక వర్గానికైనా, అదే పరిష్కారం! కొన్ని దాంపత్య సమస్యలకు మార్పులూ-సంస్కరణలూ, జవాబులు కాలేవు. దూరాలే, వ్యతిరేకతలే, తిరస్కారాలే, ఒంటరితనాలే, ఆత్మగౌరవం గల పరిష్కారాలు అవుతాయి. ఈ కథా వస్తువు అంతా కేవలం నా ఊహ కాదు! అంతా కేవలం నా కల్పన కాదు! వాస్తవాలు అనేకం ఉన్నాయి. ఈ రచనలో కనపడే సంఘటనలన్నీ కేవలం నా కల్పనలుగా నన్ను సందేహించకండి! నన్ను శంకించకండి!