ALL CATEGORIES

కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి, గోవిందరాజు చక్రధర్‌, జనప వెంకటరాజం

వేంగీ తూర్పు చాళుక్యుల చరిత్ర రచన జరగక పోవటం చాలా కాలం నుండి కొరతగానే భావించటం జరిగింది. ఈ వంశానికి చెందిన ఎన్నో శాసనాలను కనుగొన్నారు, వాటి ప్రచురణ కూడ జరిగింది. అయితే వాటిలో ఉన్న చారిత్రక సమాచారాన్ని పూర్తిగా   వినియోగించుకొని ఆ కుటుంబ పరంపరను చెప్పే ప్రయత్నం జరగలేదు. కనుక, ప్రస్తుతం లభ్యమయ్యే సమాచారంతో తూర్పు చాళుక్యుల చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం.