ALL CATEGORIES

నేనీ నవల ఎందుకు రాశాను?

మనిషి స్వచ్ఛంగా,పవిత్రంగా వుండాలని ఎంత ఆశించినా,సరళమైన జీవితం గడపాలని ఎంత తాపత్రయ పడినా ఇతరుల అనవసర జోక్యం వల్ల సరళరేఖ వక్రరేఖగా మారిపోతూ వుంటుంది.

ఒళ్ళపొగరెక్కి,వ్యసనాలకి బానిసలై,అలవాట్లకు, అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి,బలహీనతలకు లొంగిపోయి, లేకపోతే చెప్పుడు మాటలకు పల్టీపడి పండులాంటి సంసారాలు పాడు చేసుకున్న వారి సంగతి అలా వుంచండి. ఆభార్యభర్తలు అన్యోన్యంగా,ఆదర్శంగా వుండి, ఎక్కడో చిన్న పొరపాటు జరిగి సరిదిద్దుకోలేక పచ్చని కాపురాలు భగ్గుమన్న సందర్భాలు మనసుని కలిచివేశాయి.

ఈ ఆవేదనే, సంఘర్షణ్ నన్నీ నవల రాయటానికి పురిగొల్పింది. ప్రస్తుత సాహిత్య ధోరణితో రాజీ పడకుండా నా ఒరిజనల్ స్టైల్ లో రాసిన నవల ఇది.