ALL CATEGORIES

ఏకాగ్రత కుదరాలంటే, జ్ఞాపకశక్తి పెరగాలంటే, గ్రూప్‌ డిస్కషన్స్‌లో. ఇంటర్వ్యూలలో ధైర్యంగా పాల్గొనాలంటే - ఎలా? అవసరమైన విషయాలు అవసరమైనప్పుడు గుర్తుకురావు. పరీక్షల ముందు అరచేతిలో చెమటలు పడతాయి - ఎందుకని? కోపం తగ్గించుకోవటం కోసం, బద్దకం వదిలించుకోవటం కోసం, పదిమందిలో మాట్లాడగలగటం కోసం - ఏం చేయాలి ? విద్యకి తెలివికి, జ్ఞానానికి ఉన్న తేడాని వివరిస్తూ, వీటిని బైట పెట్టగలిగే ప్రతిస్పందన ఎలా పెంచుకోవాలో ఈ పుస్తకంలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ వివరించారు. ఇంకా మొండితనం, నిస్తేజం, మందకొడితనం, అల్లరి, టీ.వీ. క్రికెట్‌ మీద అంతులేని ఉత్సాహం ఉన్న పిల్లలని అత్యుత్తమంగా పెంచటానికి అద్భుతమైన అయిదు సూత్రాలని ఇంతవరకు ఎవరు చెప్పని విధానంలో అందరికి అర్ధమయ్యే రీతిలో, తల్లిదండ్రులకోసం ఇందులో పొందుపరచారు. ఇదంతా టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఈ పుస్తకం విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఇందులో సూచించిన సూత్రాలని కొన్నింటినైనా ఆచరించగలిగితే వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారన్న నమ్మకం మాకుంది. కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులవడమే కాదు. జీవితంలో పైకి రావడానికి ఇంకా ఏమేమి అర్హతలు ఉండాలో కూడా రచయిత చర్చించారు. ఈ పుస్తకం చదివిన వారంతా ఐన్‌స్టీనో, న్యూటనో అవుతారని కాదు గాని, కొందరు మాత్రం తప్పకుండా మారుతారు. వారికోసమే ఈ పుస్తకం. చదివి బాగుంది అనుకోవడం వేరు. ఆచరించటంవేరు. మీ పిల్లల్ని రెండో విభాగంలో ఉంచటానికి ప్రయత్నించండి.