ALL CATEGORIES

JMS Yoga - జె.ఎం.యస్. యోగ

Rs. 200 Rs. 180

Title : J.M.S. Yoga - జె.ఎం.యస్. యోగ Author : Jangam Srinivasa Chakravarthy - జంగం శ్రీనివాస చక్రవర్తి Publication : J.M.S.Yogabharati - జె.ఎం.యస్.యోగభారతి Tags : అంతర్జాతీయ యోగ డే జూన్ 21 సందర్భంగా యోగభారతి కానుక, International Yoga Day June 21 Special Kanuka,

Availability :

Category: New Arrivals
యోగ - నేటి అవసరము ఆర్థికదోపిడి ఆధునికతగా, అనాగరిక హింస యాజమాన్య పద్ధతిగా చలామణి అవుతున్న రోజులివి. శతాబ్దాల తరబడి పేదరికంలో, ఆకలితో, అజ్ఞానంతో, అంతులేని దుర్వ్యసనాలతో దుర్భరజీవితాలను గడుపుతున్న జీవితాల్లోకి 'యోగ' ప్రవేశించాలి. యోగఫలాలు వారికందాఇ. అదే లక్ష్యం. పేరుకు పోయిన కొవ్వు కరగడానికో, అశ్రద్ధతో గుట్టలా పెంచేసిన రోగాలను నివారించుకోడానికో యోగను పరిమితం చేయడం తప్పు. యోగఫలాలు సమాజం అంతటా అందాలి. ప్రాధమిక విద్యాస్థాయినుండే యోగ విద్యనందిస్తే పిల్లలు బలమైన, స్పష్టమైన, నిర్మల భావాలతో పెరిగే అవకాశం కల్గుతుంది. చురుకుదనంతో పాటు తెలివిదనం, ధైర్యం, సాహసం, ఉత్సాహం ఇనుమడిస్తాయి. ఆరోగ్యం అభేద్యంగా మారి ఆనందాన్నిస్తుంది. యోగను తెలుసుకోవడానికి మనమేమీ ఆరాటపడనక్కరలేదు. మన సంస్కృతిలో అణువణువు ఆక్రమించిన 'యోగ'ను ఆశ్రయించాలనుకోవడమే అర్హత. శరీరము, మనసుల మధ్య సదవగాహనను కుదిర్చి, సత్యస్ఫూర్తితో సానుకూలనతలు సృష్టించేది యోగసాధన.