ALL CATEGORIES

Showing 369-384 of 395 results

tanikella-bharani-natikalu-telugu-book-by-tanikella-bharani

Tanikella Bharani Natikalu By Tanikella Bharani

Rs. 125 Rs. 113

<p>తనికెళ్ళ భరణి వ్రాసిన అయిదు నాటికల సంపుటం (గార్థభాండం, కొక్కొరోకో, గోగ్రహణం, ఛల్&zwnj; ఛల్&zwnj; గుర్రం !, జంబూద్వీపం) &#39;తనికెళ్ళ భరణి నాటికలు&#39;. &#39;&#39;గార్థభాండం&#39;&#39; సువర్ణాక్షరలిఖిత గత చరిత్రకూ, భావి ఉషస్సుకూ మధ్య వర్తమానపు అంధకారమే గార్థభాండం. లంచగొండితనం, బందుప్రీతి ఇవే అధికార పీఠానికి పెట్టని అలంకారాలు. ఆ అవలక్షణాలను భరిస్తూ...సహిస్తూ మౌనంగా రోదించడమే ప్రజల తక్షణ కర్తవ్యం. ప్రశ్నను భరించే శక్తి అధికారానికి ఉండదు. గొంతు లేస్తే అది రాజద్రోహం. ఆకలి మహాప్రభో అంటే రాజద్రోహం. గాలిపీలిస్తే రాజద్రోహం. ఎండిన ఆకులే భగ్గున మండుతాయి. నిప్పురవ్వను ఆర్పాలనుకోవడం మూర్ఖత్వం. మంట దావానలంగా చుట్టుముడుతుంది. ఏ దేశంలో వేలిముద్రలు కిరీటాలను ధరిస్తాయో ఆ దేశపు ప్రతి అంగుళంలోనూ ఆరాచకపు పిశాచాలు విలయ తాండవం చేస్తాయి. ఇటువంటి వ్యవస్థలో ప్రజలచేత ప్రజల కొరకు ఏర్పడి ప్రజలది మాత్రం కానిదే గార్దభాండం అనే సందేశంతో భరణి వ్రాసిన నాటిక ఇది. వంశపారంపర్య వారసత్వ చరిత్రలో గాడిదలు గుడ్లు పెడతాయి. నరమాంస భక్షణకు అలవాటు పడ్డ పులులు భగవద్గీతను పఠిస్తాయి. దున్నపోతులు ఈనుతాయి. అజ్ఞానం, అవివేకం అధికార పీఠంపై కూర్చుంటే అవకాశవాదం, తెరవెనుక సూత్రధారత్వం చక్రాలను గిరగిరా తిప్పేస్తాయి. ఈ అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే అహంకారం ఉలిక్కిపడి నిలువునా గంగవెఱ్ఱు లెత్తుతుంది. అది నిజం గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కి వేస్తుందనే ఇతివృత్తంగా భరణి వ్రాసిన నాటిక గార్దభాండం. పాలకుల దుర్నీతిని, నిర్లజ్జను నిర్భయంగా చీల్చి చెండాడిన నాటిక గార్థభాండం. ఈ నాటిక వర్తమాన రాజకీయ చిత్రపటాన్ని కలైడో స్కోప్&zwnj;లో చూపిస్తుంది... అలాగే</p>

satyaharichandriyam-telugu-book-by-sri-balijepalli-lakshmikantha-kavi

Satyaharichandriyam By Sri Balijepalli Lakshmikantha Kavi

Rs. 108

<p>1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం. చెల్లియో, చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందరుం దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగుగు బొందు సేసెదో ! యెల్లి రణంబు గుర్చేదవో ! యేర్పడ జెప్పము కౌరవేశ్వరా ! - తిరుపతి వెంకట కవులు చావును లేమియున్ మనుజ సంతతికిన్ వ్యసనంబు : లందులో జావున సంభవించేడు వి చార మఱoగు దినక్రమంబునన్: జీవున కీదరిద్రగతి చే జనియించేడు ఘోర దుఖమో దైవమ ! జీవముల్గలుగు దాక నశింపక వృద్దింజెందేడున్. ఇటులెంతైన ధనంబు వచ్చినను రా! నీ గాధిరాట్సూతి నా కేటు కష్టంబుల దేచ్చెనేనియును దే! నీ దివ్యభోగంబు లే న్నిటి నాకాజడదారి ఇచ్చినను నీ ! నీ సత్యముం దప్పనే నిటు సూర్యుండటుతోచెనే యీ వినుండీ మీరు ముమ్మాటికిన్. - బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ఆ తరంలో ఈ పద్యాలు విద్యాగంధం లేని వారుకూడా ప్రదర్శనలు చూస్తూ నెమరు వేసుకోవడం నేనెరుగుదును. అవి ఛందోబద్ద కవిత్వమే కాక సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతాయి. అందుకే ఈనాటి తరం పాటకుల కోసం ఈ ప్రచురణ. Features</p>

pandavodhyogam-telugu-book-by-tirupati-venkata-kavulu

Pandavodhyogam By Tirupati Venkata Kavulu

Rs. 150

<p>ఎందరో నటీనటులకు ప్రాణప్రతిష్ట చేసిన నాటకమిది. ఎక్కడ ఆంధ్రుడున్నా అక్కడ ఈ నాటక ప్రదర్శన జరిగి తెలుగు పద్యానికి ఎనలేని గౌరవాన్ని సంపాదించిపెట్టి ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించి రచయితకు, నటులకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టి తిక్కన రాయభార ఘట్టాన్ని మరింపింపజేసి రెండు మూడుతరాల పట్టణ, పల్లె జనాల నాలుకలపై నడనాడిన పద్యాలు ఈ నాటక ప్రాశస్త్యానికి నిదర్శనం కాగా నటరత్న నందమూరి తారక రామారావుగారు దర్శకత్వం వహించిన &#39;కర్ణ&#39; చిత్రంలోని రాయభార ఘట్టంలో తన హావభావాలలో ఈ పద్యాలకు మరింత ప్రాణప్రతిష్ఠ తెచ్చి కవులకు తనకు జనహృదయాలలో స్ధానం సంపాదించిన మేటి నాటకం &#39;ఈ పాండవోద్యోగం&#39;.</p>