ALL CATEGORIES

 కొన్ని లక్షల సంవత్సరాల మానవ జీవితం ఆటవికంగా జరిగింది. ఆ తరువాత కాలంలో కొన్ని వేల సంవత్సరాలుగా సామాజికంగా నడుస్తోంది. మానవులు సాంఘీక జీవులుగా మారి కొన్ని కట్టుబాట్లుకు లోనైనారు.ఆ కట్టుబాట్లు వివిధ రకాలు ఒడిదుడుకులను లోనవుతూ వచ్చాయి. సామాజిక జీవనంలోని ఒడిదుడుకులను తగ్గి, మానవులు సుఖసనతౌలతో జీవిం చేందుకు ఎన్నో మార్గాలు సూచించారు. ఎందరో మేధవులు తమ మేధస్సును ఉపయోగించి ఆ వైపుగా ఆలోచనలు చేసారు. దాంతో సామాజిక జీవనం యంతో కొంతగా మెరుగు పడుతూ వచ్చింది. అలా సూచింపబడిన మార్గాలనే మతం అన్నారు. మార్గాలను సూచించిన వారిని తత్వ వేత్తలు అంటారు. ప్రపంచ ప్రఖ్యాత  తత్వ వేత్తలలో పేరెన్నికగన్నవారు ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్యుని  చరిత్రను యువతకు అందించే ప్రయతం చేస్తునాము.