ALL CATEGORIES

అందని చందమామ మనుచరిత్రలో వరూధిని ప్రవరుణ్ణి కోరింది. అతగాడు తిరస్కరించి వెళ్ళిపోయాడు. వరూధిని మీద మక్కువగల గంధర్వుడు మాయా ప్రవరుడుగా వరూధినిని చేరాడు. స్వరోచి అన్న కుమారుడు కలిగాడు. అంతటితో కథ పూర్తి కాలేదు. వరూధిని ముందు తన నిజస్వరూపం బయటపెట్టాడు. తర్వాత ఏమైందో గణపతి శాస్త్రిగారి ‘అందనిచందమామ’ చెపుతుంది. ప్రేమను కొత్త కోణంలో చూసిన నవల ‘అందని చందమామ.’ నాగమల్లిక గోపాల కృష్ణుని మోహన మురళీగానం ఆబాలగోపాలాన్నీ తనవైపు లాక్కుంటుంది. గోపికలు ఆ గానంలో సర్వం మరచి ఆ గోపాలదేవునికి తమ సర్వస్వాన్నీ అర్పించుకున్నారు. ఆ గోపికలకు లభించిందేమిటి? గోపాలకృష్ణునిపై ప్రేమ వల్ల గోపికలెవరైనా సంపూర్ణముక్తి సాధించారా? ‘నాగమల్లిక’ లో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. పిలకా గణపతి శాస్త్రిగారి కమనీయకథనం చదవండి.